Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
అంబర్పేట్ విద్యానగర్ లోని అరబిందో ఇంటర్నేషనల్ స్కూల్లో తల్లిదండ్రులు నెలవారి ఫీజులు కట్టడానికి లేట్ అయిందని నెలకు 2000 నుంచి 3000 రూపాయలు ఫైన్లు వేస్తు ముక్కు పిండి వసూలు చేస్తు దోపిడీ చేస్తున్నారూ. అరబిందో ట్రస్ట్ పేరుతో పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందించడానికి ఈ సంస్థ స్థాపిస్తే ఇప్పుడు ఆ పేరుతో లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏంటి అని యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే ఈ స్కూల్లో చదువుకోవాలి డబ్బులైనటువంటి విద్యార్థులు చదువుకోవద్దు అని యాజమాన్యం దురుసుగా మట్లాడుతుంది. విద్యాశాఖ రూల్స్ ప్రకారము విద్యార్థుల చేత ఫైన్ వసూలు చేయొద్దని ఉన్న దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు.
ఇదే కాకుండా స్పోర్ట్స్ పేరుతో నెలకు 1000 నుంచి 2000 రూపాయలు వసూలు చేస్తున్నారు. మండల విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేస్తే అధికారి కూడా స్కూలు యాజమాన్యానికి అనుగుణంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఇప్పటివరకు విద్యార్థుల చేత వసూలు చేసినటువంటి ఫైన్ రూపాయలు ఆ తల్లిదండ్రులకు తిరిగి చెల్లించాలని ఎస్ఎఫ్ఐ, డి వై ఎఫ్ ఐ హైదరాబాద్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఈరోజు స్కూలు ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్ అశోక రెడ్డి, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జావీద్ ఎస్ఎఫ్ఐ ఉపాధ్యక్షుడు నాగేందర్, స్టాలిన్, ఏసుదాసు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.