Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
బీబీసీ కార్యాలయాల పై భారతదేశానికి చెందిన ఆస్తిపన్ను అధికారులు దాడులు బ్రిటన్ పార్లమెంట్‌కు చేరింది. బీబీసీ డాక్యుమెంటరీతోపాటు వారి కార్యాలయాలపై ఐటీ దాడులు చేయడంపై బ్రిటన్ పార్లమెంట్లో చర్చించారు. ఈ తరుణంలో తమ ప్రభుత్వం బీబీసీకి అండగా ఉంటుందని, బ్రిటన్ పార్లమెంట్ బీబీసీకి నిధులు సమకూరుస్తుందని, మేము దాని స్వతంత్రతను గౌరవిస్తామని ప్రధాని రుషి సునాక్ ప్రతినిధిగా ఎంపీ డేవిడ్ రాట్లీ తెలిపారు.
భారతదేశంలోని ఢిల్లీ, ముంబై బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరిగిన విషయంపై ఎంపీ డేవిడ్ రాట్లీ మాట్లాడుతూ బీబీసీకి వాక్ స్వాతంత్ర్యం ఉన్నదని, అది మాకు చాలా ముఖ్యమైనదని తెలిపారు. భారత ప్రభుత్వానికి కూడా ఈ విషయం చెప్పాలనుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛ చాలా ముఖ్యమని ఆయన అన్నారు. భారతదేశంతో ఉన్న సంబంధాలను ప్రస్తావిస్తూ, యూకే-భారతదేశం లోతైన స్నేహాన్ని కలిగి ఉన్నాయని, ఇతర సమస్యలతో పాటు దీనిపై భారత ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నారు.