Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ హైదరాబాద్: ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో ఒక బొగ్గు గని కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇన్నర్ మంగోలియా ప్రాంతం పశ్చిమ భాగంలోని అల్క్సా లీగ్లో మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 53 మంది తప్పిపోయారని చైనా మీడియా తెలిపింది. కూలిన గనిలో పనిచేసే అనేక మంది సిబ్బంది, వాహనాలు చిక్కుకున్నాయని తెలిపింది. రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని రక్షణ చర్యలు చేపట్టారు. తప్పిపోయిన వ్యక్తులను శోధించడానికి, రక్షించడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేయాలని చైనా అధ్యక్షుడు జి జిన్పింగ్ అధికారులను ఆదేశించారు. 330 కంటే ఎక్కువ మంది సిబ్బందితో కూడిన ఎనిమిది రెస్క్యూ టీమ్లు 100కి పైగా రెస్క్యూ పరికరాలతో పాటు ఘటనాస్థలిలో చర్యలు చేపట్టాయి.