Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : భారీ ఆశలతో ప్రపంచకప్ బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.. అసలు సిసలు పోటీకి సిద్ధమైంది. గత కొన్నాళ్లుగా కొరుకుడుపడని కొయ్యలా మారిన ఆస్ట్రేలియాతో మన అమ్మాయిలు గురువారం తొలి సెమీఫైనల్లో తలపడనున్నారు. గ్రూప్-1లో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా అజేయంగా సెమీస్ చేరగా.. గ్రూప్-2 నుంచి మూడు విజయాలతో రెండో స్థానంలో భారత్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్, వెస్టిండీస్, ఐర్లాండ్‌పై విజయాలు సాధించిన టీమ్ఇండియా.. ఇంగ్లండ్ చేతిలో ఓడింది. ఇటీవల ఐసీసీ తొలిసారి ప్రవేశ పెట్టిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న భారత్.. సీనియర్ స్థాయిలో తొలి కప్పు చేజిక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. గత మూడు పర్యాయాలు టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్‌కు చేరిన టీమ్ఇండియా.. 2020లో రన్నరప్‌గా నిలిచింది. అప్పుడు ఆసీస్ చేతిలోనే దెబ్బతిన్న హర్మన్‌ప్రీత్ బృందం ఈసారి దెబ్బకు దెబ్బ కొట్టాలని కృతనిశ్చయంతో ఉంది.