Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నేడు టీడీపీలో కన్నా లక్ష్మీనారాయణ చేరనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2: 45 నిమిషాలకు పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు కన్నా లక్ష్మీనారాయణ, తదితరులు. కన్నా టిడిపిలో చేరనున్న నేపథ్యంలో గుంటూరు నుండి మంగళగిరి టిడిపి కేంద్ర కార్యాలయం వరకు 500 కార్లతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు టీడీపీ శ్రేణులు. 5000 మంది కార్యకర్తలు ముఖ్య నాయకులతో టీడీపీలో చేరనున్నారు కన్నా లక్ష్మీనారాయణ. కాగా, నాలుగు రోజుల కిందటే, బీజేపీ పార్టీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. బీజేపీ రాష్ట్ర అధిష్టానం తీరు నచ్చకపోవడంతో.. టీడీపీ పార్టీలో చేరుతున్నారు కన్నా లక్ష్మీనారాయణ.