Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అమెరికాలో ఓ విమానం కుప్పకూలింది. ఆర్కన్సస్ ఎయిర్పోర్టు నుంచి ల్యాండ్ అయిన కొద్దిసేపటికే డబుల్ ఇంజిన్ ప్లేన్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్ సహా ఐదుగురు దుర్మరణం చెందారు. ఆర్కన్సస్ విమానాశ్రయానికి కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. మృతులంతా సీటీఈహెచ్ ఉద్యోగులుగా తెలుస్తోంది. ఒహియో బెడ్ఫోర్డ్లో ఉన్న ఒక మెటల్ మాన్యుఫ్యాక్షరింగ్ కంపెనీలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఇందులో ఒక వ్యక్తి దుర్మరణం చెందగా.. 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై విచారణ జరిపేందుకు సీటీఈహెచ్ ఉద్యోగుల బృందం బుధవారం ఆర్కన్సస్ నుంచి ఒహియోకు బయల్దేరింది. బిల్ అండ్ హిల్లరీ క్లింటన్ నేషనల్ ఎయిర్పోర్టు నుంచి ఒహియోలోని జాన్గ్లెన్ కొలంబస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు వెళ్లేందుకు ట్విన్ ఇంజిన్ బీఈ20 టేకాఫ్ అయ్యింది. ఆ తర్వా కొద్ది క్షణాల్లో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి కుప్పకూలింది. ఒహియో ఎయిర్పోర్టుకు కేవలం రెండు మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది.