Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ అమెరికాకు వెళ్లారు. అమెరికాలో ల్యాండ్ అయిన చరణ్ కు అభిమానులు ఘన స్వాగతం పలికారు. వచ్చే నెల 12న ఆస్కార్ అవార్డుల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమెరికాకు వెళ్లినట్టు తెలుస్తోంది. 'ఆర్ఆర్ఆర్' చిత్రంలోని నాటునాటు పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ పాటకు ఆస్కార్ రావడం ఖాయమనే అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన యూఎస్ కు వెళ్లినట్టు తెలుస్తోంది. త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి కూడా అమెరికాకు వెళ్లనున్నారు. మరోవైపు, రామ్ చరణ్ జీఎంఏ (గుడ్ మార్నింగ్ అమెరికా) టెలివిజన్ షోన్ లో కనిపించారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా ఘన విజయంపై ఆయన మాట్లాడారు. రేపు జరగనున్న హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకలో ఆయన ప్రెజెంటర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకు టాలీవుడ్ లో మరెవరికీ ఈ ఘనత దక్కలేదు.