THE. WAIT. IS. OVER. ⏳#OrangeArmy, say hello to our new captain Aiden Markram 🧡#AidenMarkram #SRHCaptain #IPL2023 | @AidzMarkram pic.twitter.com/3kQelkd8CP
— SunRisers Hyderabad (@SunRisers) February 23, 2023
Authorization

నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ నూతన కెప్టెన్ గా దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ ఏడెన్ మార్క్రమ్ నియమించారు. గతంలో కొన్నేళ్ల పాటు డేవిడ్ వార్నర్, ఆపై కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్ జట్టును నడిపించారు. మధ్యలో కొన్ని సార్లు భువనేశ్వర్ కుమార్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించినా అది తాత్కాలికమే. వార్నర్ గత సీజన్లోనే సన్‌రైజర్స్‌ను వీడగా, ఈ సీజన్‌కు ముందు విలియమ్సన్‌ను సన్‌రైజర్స్ విడిచిపెట్టింది.
దీంతో జట్టు కెప్టెన్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో సన్‌రైజర్స్ యాజమాన్యం మార్క్రమ్కు అవకాశమిచ్చింది. అయితే సన్‌రైజర్స్ యాజమాన్యానికి చెందిన అనుబంధ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ జట్టుకు కూడా మార్క్రమ్ సారథ్యం వహించాడు. ఇటీవల జరిగిన ఎస్ఏ20 (దక్షిణాఫ్రికా టీ20 ఫ్రాంఛైజీ క్రికెట్ టోర్నీ) టోర్నీలో మారక్రమ్ జట్టు విజేతగా నిలిచింది.