Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ మొదటి గవర్నర్ జనరల్ రాజగోపాలాచారి మనవడు సీఆర్ కేశవన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా సమర్పించారు. కాంగ్రెస్ పార్టీతో రెండు దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖను పంపించారు. 2001 లో విదేశాల్లో కెరీర్ కాదనుకుని కాంగ్రెస్ పార్టీలో చేరిన నాటి నుంచి రాజీనామా చేసే వరకు పరిణామాలను లేఖలో వివరించారు. 'సమ్మిళిత, జాతీయ పరివర్తన సిద్ధాంతానికి కట్టుబడి 2001లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. రెండు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో పనిచేసిన నాకు పార్టీలో ఎలాంటి విలువలు ప్రస్తుతం కనిపించడం లేదు. పార్టీ పస్తుతం చెబుతున్న దానితో నేను ఏకీభవిస్తానని చెప్పలేను. అందుకే నేను ఇటీవల సంస్థాగత బాధ్యతలకు సైతం దూరంగా ఉన్నాను. భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేదు' అని లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేపట్టిన ఎన్నో బాధ్యతలను గురించి కూడా ప్రస్తావించారు. ఏ ఇతర పార్టీతోనూ సంప్రదింపులు చేయడం లేదని స్పష్టం చేస్తూ, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పలేనన్నారు.