Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు భారీగా బంగారం స్వాధీనం చేసుకున్నారు. సూడాన్ నుంచి హైదరాబాద్కు వచ్చిన 23 మంది ప్రయాణికుల నుంచి 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. వీరంతా షూ కింద ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుని, బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ. 7.90 కోట్లు ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో నలుగురిని అరెస్టు చేశామన్నారు. మిగతా వారిని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇటీవల కాలంలో సీజ్ చేసిన బంగారంలో ఇదే అత్యధికమని శంషాబాద్ ఎయిర్పోర్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.