Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ తొమ్మిదవ గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాల్లో ఛత్తీస్‌గఢ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అరుప్ కుమార్ గోస్వామి హరిచందన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. అయితే ఈ క్రమంలో గవర్నర్ హరిచందన్ హిందీలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి భూపేష్ భఘేల్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రవీంద్ర చౌబే, ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్ సావో, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రమణ్ సింగ్, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత నారాయణ్ చందేల్తో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.