Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మధ్యాహ్న భోజనానికి ఆధార్ కార్డు లింక్ చేయటాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలి. నవతెలంగాణ - హైదరాబాద్
దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఎం పోషన్ పోర్టల్ లో తప్పకుండా ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీనిని వెంటనే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. ప్రభుత్వ పాఠశాలలో పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రయివేట్ పాఠశాలలో చదువుకునే స్తోమత లేక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు.
కనీసం సరైన భోజనం అందని కుటుంబాలకు చెందిన విద్యార్థులు పాఠశాలలో నైన మధ్యాహ్న భోజనం చేయటానికి వెళ్తుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందకుండా పోతుంది. దానివల్ల విద్యార్థులు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్న భోజనం పెట్టడంతో విద్యార్థుల సఖ్య పెరిగింది. కానీ ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు నాణ్యమైన భోజనం తో పాటు చదువుకు దూరమయ్యే అవకాశం ఉంది.ఇప్పటికే అనేకమంది వారి వెళ్ళిముద్రలు, బయోమెట్రిక్ సమస్యలు వల్లన ఆధార్ జారీ కానీ వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ నిర్ణయం ప్రధానంగా పేద విద్యార్ధులకు నష్టదాయకంగా ఉంటుంది. కావున ఈ నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలని ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, టి నాగరాజు డిమాండ్ చేశారు.