Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మార్చి 2 నుంచి డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్టులుతెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోన్న విషయం విదితమే. ఇప్పటికే ఫిజికల్ ఈవెంట్స్‌ను పూర్తి చేసిన తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) గురువారం కీలక ప్రకటన చేసింది. ఎస్సీటీ పోలీసు కానిస్టేబుల్(డ్రైవర్స్), ఎస్సీటీ పోలీసు కానిస్టేబుల్(మెకానిక్స్)తో పాటు రాష్ట్ర విపత్తు, అగ్నిమాపక శాఖల్లోని డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు మార్చి 2వ తేదీ నుంచి డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్టులను నిర్వహించనున్నట్లు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.
ఇటీవల నిర్వహించిన ఫిజికల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించిన వారు మాత్రమే డ్రైవింగ్, మెకానిక్ ట్రేడ్ టెస్టులకు అర్హులు అని టీఎస్ఎల్పీఆర్బీ స్పష్టం చేసింది. అర్హులు ఫిబ్రవరి 25 ఉదయం 8 గంటల నుంచి, ఫిబ్రవరి 28 రాత్రి 12 గంటల వరకు టీఎస్ఎల్పీఆర్బీ వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ4 సైజు పేపర్లోనే ప్రింట్ తీసుకోవాలి. ఇతర వివరాల కోసం 93937 11110 లేదా 93910 05006 నంబర్లను సంప్రదించొచ్చు.