Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల: జిల్లాలోని సింగరేణి ఎస్ఆర్పీ-3 గనిలో మిథేన్ గ్యాస్ లీక్ అయ్యింది. గ్యాస్ లీకేజీ ని గుర్తించిన కార్మికులు బయటికి రాగా, కొందరు మాత్రం లోపలే ఉండిపోయారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం రంగంలోకి దిగి గని లోపల 34 డిస్ట్రిక్ట్ 2వ లెవల్ 3వ డిప్ దగ్గర పడిపోయి ఉన్న ఇద్దరు కార్మికులను ప్రస్తుతం బయటికి తీసుకువచ్చారు. హాలర్ ఆపరేటర్ రవి, రజినీకాంత్‌ను బయటకు తీసుకువచ్చి వారిని రామకృష్ణపూర్ లోని సింగరేణి ఆసుపత్రికి తరలించారు. రెస్క్యూ టీం బయటికి వచ్చాక పూర్తి వివరాలు తెలియవలసి ఉందని సింగరేణి అధికారులు తెలిపారు.