Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: మార్చి నెలకు సంబంధించిన శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడించారు. మార్చి నెలకు సంబంధించిన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ వర్చువల్ సేవాటికెట్ల కోటాను, సంబంధిత దర్శన టికెట్ల కోటాను సాయంత్రం 4 గంటలకు విడుదల చేస్తారని తెలిపారు.భక్తులు ఈ విషయాలను గమనించి తదనుగుణంగా టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.