Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
సింగరేణిపై మోడీ కన్నుపడిందని, ప్రైవేటుపరం చేసేందుకు కుట్రలు చేస్తున్నట్లుగా కార్మికులు, సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చెందుతున్నారని కేటీఆర్ అన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఎంత వరకైనా వెళ్తామని, అవసరమైతే మరో సకలజనుల సమ్మెకు సిద్ధపడుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. భూపాలపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అస్థిత్వాన్ని కాపాడుకుంటూ ముందుకుపోతున్నాం. స్వరాష్ట్రంలో భూపాలపల్లి జిల్లాకు ఆచార్య జయశంకర్ పేరు పెట్టుకున్నాం. ఆసిఫాబాద్ జిల్లాకు కొమ్రుంభీం పేరుకుటుకున్నాం. ఆచార్య శంకర్ పేరు జిల్లాకే కాదు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్నాం. పీవీ నరసింహరావు పేరును మరో యూనివర్సిటీకి పెట్టుకున్నాం. కొండాలక్ష్మణ్ బాపూజీ పేరును మరో యూనివర్సిటీకి పెట్టుకున్నాం. ఇలా ఒక్కో పని చేసుకుంటూ వెళ్తున్నాం. కాళోజీ పేరిట కాళోజీ కళాక్షేత్రం వరంగల్‌లో కట్టుకుంటున్నాం. హెల్త్ యూనివర్సిటీని పెట్టుకున్నాం. పనులు చేసుకుంటూ వెళ్లే క్రమంలో కావాలని ఓ శత్రుదేశంపై కక్షగట్టినట్టు ప్రధాని నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ మాటలతో ఇతర వేటకుక్కల్లాంటి సంస్థలతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. 2014లో నర్రేందమోడీ ఎన్ని మాటలు చెప్పిండో.. ఎన్ని బొంకిండో గుర్తు చేసుకోవాలి. అందరూ జన్‌ధన్ ఖాతాలు తెరిస్తే.. ధనాధన్ రూ.15లక్షలు ఇస్తానని చెప్పాడని, మరి ఎవరికైనా రూ.15లక్షలు వచ్చాయా? మరి ఇవన్నీ ఒకరి ఖాతాలోకి వెళ్లాయి? అతనేమో ప్రపంచ కుబేరుడయ్యాడు.. మనకు చేతిలో చిప్ప మిగిలింది. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వడు. నవోదయ విశ్వవిద్యాలయం ఇవ్వడు. ఒక్క ఐఐఎం, నేషనల్ ఇనిస్టిట్యూటషన్ ఇఫ్ డిజైన్ ఇవ్వడు. చట్టప్రకారం రావాల్సిన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వడు. మిషన్ భగీరథకు పైసలు ఇవ్వమంటే.. ప్రశంసలు కురిపిస్తున్నరు కానీ డబ్బులు ఇవ్వడం లేదు. మిషన్ భగీరథకు రూ.19వేలకోట్లు, మిషన్‌కాకతీయకు రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినా ఇవ్వలే’ అంటూ మండిపడ్డారు.