Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కేఎంసీ పీజీ విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. పంజాగుట్ట నిమ్స్‌లో ఆమె చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం నిమ్స్‌కు వెళ్లిన తెలంగాణ గవర్నర్ తమిళి సై.. ప్రీతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ... ‘‘వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఒక వైద్య విద్యార్థినికి ఇలా జరగడం దురదృష్టకరం. సీనియర్ వైద్యుడు విద్యార్థినిని వేధించటం దారుణం. వైద్య విద్యార్థినులు ధైర్యంగా ఉండాలి. ప్రీతి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోంది’’ అని గవర్నర్ వెల్లడించారు. సీనియర్ వేధింపులు తట్టుకోలేక వరంగల్‌లోని కాకతీయ వైద్యకళాశాలలో పీజీ మత్తు వైద్యం (అనస్థీషియా) మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ప్రీతి బుధవారం తెల్లవారుజామున బలవన్మరణానికి యత్నించారు.