Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మంచిర్యాల: మరి కొద్ది గంటల్లోనే పెండ్లి. అంతలోనే వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే పెండ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. వరుడు వధువుకు ఆస్పత్రి బెడ్‌పై తాళి కట్టేశాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నూరు మండలం లంబాడిపల్లికి చెందిన శైలజకు, భూపాలపల్లి జిల్లాకు చెందిన తిరుపతితో గురువారం వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. అయితే బుధవారం వధువు తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను మంచిర్యాలలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు చికిత్స అందించారు. పెండ్లి వాయిదా పడొద్దనే ఉద్దేశంతో.. ఆస్పత్రి బెడ్‌పైన ఉన్న వధువుకు వరుడు తాళి కట్టేశాడు. నూతన వధూవరులిద్దరూ ఆస్పత్రిలో పెండ్లి చేసుకునేందుకు సహకరించిన వైద్య సిబ్బందికి ఇరు కుటుంబాల సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.