Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మెడకు నెమ్మదిగా ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో సీబీఐ అన్ని వేళ్లూ అవినాష్ వైపు చూపిస్తున్న తరుణంలో ఇవాళ మరోసారి ఆయన సీబీఐ ఎదుట హాజరుకానున్నారు. విచారణ కోసం ఇప్పటికే ఆయన హైదరాబాద్ చేరుకున్నారు. గతనెల 28న తొలిసారి అవినాష్‌రెడ్డిని ప్రశ్నించిన సీబీఐ కీలక సమాచారాన్ని సేకరించింది. సునీల్‌యాదవ్ బెయిలు పిటిషన్ సందర్భంగా సీబీఐ వేసిన కౌంటర్ అఫిడవిట్లో అవినాష్‌రెడ్డి పాత్రపై కీలకమైన వ్యాఖ్యలు చేసిన సీబీఐ నేడు మరింత లోతుగా ఆయన్ని విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నెలరోజుల వ్యవధిలో జరిగిన కీలక పరిణామాలు, సీబీఐకి వచ్చిన అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి వివేకా హత్య కేసులో దాగివున్న కుట్ర కోణాన్ని వెలికి తీయడానికి సీబీఐ అధికారులు అవినాష్‌రెడ్డిని విచారణకు పిలిచినట్లు తెలుస్తోంది.