Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. జిమ్‌లో హుషారుగా జిమ్ చేస్తున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గుండెపోటు రావడంతో క్షణాల్లోనే కన్నుమూశాడు. నగరంలోని ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నర్వహిస్తున్న విశాల్.. రోజూలానే శుక్రవారం ఉదయం బోయిన్‌పల్లిలోని ఓ జిమ్‌కు వెళ్లారు. వ్యాయామం చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందోనని సహచరులు వచ్చి చూసేలోపే మృతిచెందాడు. అయితే ఆయనను దవాఖానకు తరలించగా గుండెపోటుతో మరణించాడని వైద్యులు నిర్ధారించారు.