Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రంగారెడ్డి : జిల్లాలోని రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘార్ చౌరస్తా బస్‌స్టాప్‌లో ఓ యువకుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన యువకుడి దగ్గరు పరుగులు తీశారు. యువకుడి గుండె కొట్టుకోవడం ఆగినట్టు గుర్తించిన కానిస్టేబుల్ ఎంతో సమయస్పూర్తితో సీఆర్పీ చేశారు. కానిస్టేబుల్ అప్రమత్తతో యువకుడి ప్రాణం నిలిచింది. సీఆర్పీ చేసిన వెంటనే యువకుడు తిరిగి ఊపిరి తీసుకున్నాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీఆర్పీ చేసి యువకుడి ప్రాణాలు కాపాడిన కానిస్టుబుల్.. అతడికి పునర్జన్మను ప్రసాదించినవాడయ్యాడు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు పడిపోయిన వెంటనే ఎంతో సమయస్పూర్తితో సీఆర్పీ చేసి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి.