Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఝరాసంగం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని క్రిష్ణాపూర్ కమాన్ సమీప దూరంలో స్కూల్ బస్సు, బైకు ఎదురెదురుగా రావడంతో ఒకరికొకరు ఢీకొన్న ఘటన మండల పరిధిలో జరిగింది. స్థానికులు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రాయికోడ్ మండలంలోని మామిడిపల్లి గ్రామానికి చెందిన విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ ఎం సాధకలి (65), ఆయన కుమారుడైన మొహినోదిన్ జహీరాబాద్ పట్టణం నుండి బైక్ పై వస్తున్న క్రమంలో ఝరాసంగం మండల కేంద్రం నుండి జహీరాబాద్ పట్టణానికి శుభకార్యానికి వెళ్తున్న అక్షర భారతి పాఠశాల బస్సు ఎదురెదురుగా వెళ్లి ఢీకొనడంతో మొహినోదిన్ అక్కడికక్కడే మృతిచెందగా, తండ్రి మజ్కూరి సాదాకలి నీ స్థానిక జహీరాబాద్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో చనిపోహినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.