Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అనకాపల్లి జిల్లాలో తాజాగా దారుణం వెలుగు చూసింది. భర్తపై కోపం పెంచుకున్న ఓ భార్య అతడిపై సలసలకాగే వేడి నూనె పోసింది. చోడవరం మండలం లక్ష్మీపురంలో బయటపడ్డ ఈ దారుణం స్థానికంగా కలకలానికి దారి తీసింది. బాధితుడు వెంకటేశ్వరరావు కొన్నాళ్ల క్రితం భార్య మరణించడంతో, విజయ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. అయితే.. ఆస్తి పంపకాల విషయంలో వెంకటేశ్వరరావుకు, విజయకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో విజయ తన పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తపై కోపం పెంచుకున్న ఆమె ఇటీవల ఓ పథకం పన్ని భర్తను మాట్లాడుకుందామంటూ పుట్టింటికి పిలిచింది. అతడు వచ్చాక సలసల కాగే నూనె అతడిపై పోసింది. దీంతో.. స్థానికులు వెంకటేశ్వరరావును ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.