Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతికి నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఎక్మోపైనే ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారని, నిమ్స్‌కు వచ్చి వైద్యులతో మాట్లాడిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.
ఈ తరుణంలో ఇలాంటి ఘటనలు దురదృష్టకరం. ప్రీతికి మెరుగైన వైద్యం అందుతోంది. గత రెండు రోజుల కంటే పరిస్థితి మెరుగుపడింది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదు. వారిని త్వరలోనే శిక్షిస్తాం. ప్రీతి ఆరోగ్యంపై గంట గంటకూ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సమీక్షిస్తున్నారు అని అన్నారు.