Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బెంగళూరు
బెంగళూరు - మైసూరు ఎక్స్‌ప్రెస్ హైవే ను ప్రధాని నరేంద్రమోడీ మార్చి 11న జాతికి అంకితం చేయనున్నారు. ఈ విషయాన్ని ఐటీబీటీ, ఉన్నత విద్యాశాఖల మంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్థనారాయణ నగరంలో గురువారం మీడియాకు తెలిపారు.
హైవేను సమీపంలోని రామనగరం హెలిపాడ్‌లో దిగి ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ప్రధాని మద్దూరు వరకు హైవేపై ప్రయాణిస్తారన్నారు. ఈ తరుణంలో హైవే కారణంగా గార్డెన్ సిటీ బెంగళూరు, రాచనగరి మైసూరుల మధ్య దూరం గణనీయంగా తగ్గిపోనుందన్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా భారీ రోడ్‌షో కూడా ఉంటుందని అనంతరం మద్దూరు వద్ద జరిగే భహిరంగ సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారని ఆయన తెలిపారు.