Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మార్చి 3 నుంచి ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుముతో మే 2 వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మే 7 నుంచి 11 వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యామండలి తెలిపింది.
ఇదే తరుణంలో పీజీ ఈసెట్ షెడ్యూల్నూ అధికారులు విడుదల చేశారు. ఈ నెల 28న పీజీ ఈసెట్ నోటిఫికేషన్ ఇచ్చి మార్చి 3 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆలస్య రుసుంతో మే 24 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. మే 21 నుంచి పీజీ ఈసెట్ హాల్టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. మే 29 నుంచి జూన్ 1 వరకు ఈ పరీక్షలను నిర్వహిస్తారు.