Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
పీజీ వైద్య విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్ పీజీ వైద్య విద్యార్థి డాక్టర్ సైఫ్‌పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో కేసును వ్యతిరేకిస్తూ కొంతమంది వైద్య విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విచారణ పూర్తి కాకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం ఎంజీఎం ఆస్పత్రిలో అత్యవసర సేవలు మినహా ఓపీ, మిగిలిన సేవలను బహిష్కరించారు.
ఈమేరకు సైఫ్‌కు మద్దతుగా నిలిచిన విద్యార్థులు ఎంజీఎం సూపరింటెండెంట్‌కు సమ్మె నోటీసులు ఇచ్చారు. అనంతరం విధులు బహిష్కరించి ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును రద్దు చేయాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. సైఫ్‌పై కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ ప్రీతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం విచారకరమని అయితే ఇదే సమయంలో సైఫ్‌పై అసాధారణమైన కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన పోస్టుల ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.