Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరువనంతపురం
కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు. కోజికోడ్ లోని కాలికట్ నుంచి సౌదీ అరేబియాలోని దమ్మాన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో సాంకేతిక సమస్య కారణంగా తిరువనంతపురం మళ్లించిన విషయం తెలిసిందే. అయితే ఆ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యం తలెత్తినట్లు సమాచారం. ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం 182 మంది ప్రయాణికులతో కాలికట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో టేకాఫ్ అయ్యే సమయంలో విమానం రన్‌వేను ఢీ కొట్టింది. దీంతో హైడ్రాలిక్ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. వెంటనే విమానాన్ని తిరువనంతపురంకు మళ్లించారు. అక్కడ ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానంలో నిండుగా ఉన్న ఇంధనాన్ని అరేబియా సముద్రంలో డంప్ చేశారు. తర్వాత మధ్యాహ్నం 12:15 గంటల సమయంలో విమానాన్ని ఎయిర్‌పోర్ట్‌లో సేఫ్‌గా ల్యాండ్ చేశారు. ఈ ఘటనతో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ కారణంతోనే తిరువనంతపురం ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు.