Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ సమయస్ఫూర్తి నిండు ప్రాణాన్ని కాపాడింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సర్కిల్ ఆరంఘార్ చౌరస్తా బస్టాప్ లో బాలరాజు అనే యువకుడు గుండెపోటుతో ఒక్కసారిగా రోడ్డుపై కుప్పకూలిపోయాడు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ రాజశేఖర్ హుటాహుటిన యువకుడి దగ్గరు పరుగులు తీశారు. యువకుడికి గుండె పోటు వచ్చిందని అర్థం కావడంతో సదరు కానిస్టేబుల్ ఎంతో సమయస్పూర్తితో సీపీఆర్ చేశారు. దాంతో, బాలరాజు తిరిగి ఊపిరి తీసుకున్నాడు. అనంతరం అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా యువకుడు పడిపోయిన వెంటనే ఎంతో సమయస్పూర్తితో సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టిన కానిస్టేబుల్ పట్ల ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. ఈ వీడియోను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ లో షేర్ చేశారు.