Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఉత్సాహంగా కొనసాగుతున్న హల్దీ ఫంక్షన్లో విషాదం నెలకొంది. నూతన వరుడికి పసుపు పెడుతూ ఓ అతిథి గుండెపోటుకు గురయ్యాడు. వరుడి కాళ్ల ముందు కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కాలాపత్తార్ ఏరియాలో ఫిబ్రవరి 20వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కాలాపత్తార్ ఏరియాలో ఓ వివాహ వేడుక నిమిత్తం.. ఆ ఇంట్లో 20వ తేదీన హల్దీ ఫంక్షన్ నిర్వహించారు. అందరూ సరదాగా నవ్వుతూ.. హల్దీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. మహ్మద్ రబ్బానీ(40) అనే అతిథి కూడా వరుడికి పసుపు పెట్టేందుకు ముందుకు వచ్చాడు. ఇక చైర్‌పై కూర్చొని పసుపు పెడుతుండగా గుండెపోటుకు గురయ్యాడు. బంధువులందరూ అప్రమత్తమై ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహ్మద్ రబ్బానీ ఓ జ్యువెలరీ షాపులో పని చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రబ్బానీ మృతి కారణంగా పెళ్లిని వాయిదా వేసుకున్నారు.