Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ 30కి పైగా దేశాల్లో సబ్ స్క్రిప్షన్ ఛార్జీలను తగ్గించింది. చందాదారులను ఆకట్టుకోవడానికి ఈజిప్టు, యెమెన్, లిబియా, ఇరాన్, కెన్యా, క్రొయేషియా, బల్గేరియా, నికరాగ్వ, ఈక్వెడార్, మలేసియా, ఇండోనేసియా, వియత్నాం, థాయ్‌లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో సబ్స్క్రిప్షన్ ఫీజును తగ్గించింది. ఇండియాలో గత కొంతకాలంగా ఓటీటీలు ఆదరణ పొందుతున్నప్పటికి మన దేశంలో మాత్రం ఛార్జీలను తగ్గించకపోవడం విచారకరమైన అంశం. నెట్‌ఫ్లిక్స్ కొన్ని దేశాల్లో భారీ స్థాయిలో ఆదరణను కోల్పోతుంది. చందాదారులు భారీగా తగ్గిపోతుండటంతో సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా (సీఎస్ఏ), సబ్ సహారన్ ఆఫ్రికా (ఎస్ఎస్ఏ), మిడిల్ ఈస్ట్ నార్త్ ఆఫ్రికా (ఏమ్ఈఎన్ఏ), సెంట్రల్ అండ్ ఈస్ట్రన్ యూరప్ (సీఈఈ), ఏసియా పసిఫిక్ (ఏపీఏసీ) తదితర రీజియన్స్‌లో భారీగా ఛార్జీలను తగ్గించింది. ఖాతాదారులను పెంచుకోవడానికి సబ్ స్క్రిఫ్షన్ ఫీజుపై దాదాపుగా 20శాతం నుంచి 60శాతం వరకు డిస్కౌంట్స్ ఇవ్వనుంది.