Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కూకట్‌పల్లిలో గురువారం రాత్రి సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ బృందాలు దాడులు నిర్వహించాయి. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్వహిస్తున్న నాలుగు మసాజ్ పార్లర్లపై స్పెషల్ ఆపరేషన్ బృందాలు దాడులు నిర్వహించి, ఓనర్లు, మేనేజర్లతో పాటు మహిళా థెరఫిస్టులను అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్న వారి నుంచి 12 మొబైల్ ఫోన్లు, రూ. 1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన 13 మందిని స్థానిక పోలీసులకు స్పెషల్ ఆపరేషన్ బృందాలు అప్పగించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టాయి. అక్రమంగా నిర్వహిస్తున్న మసాజ్ పార్లర్ల గురించి తెలిసి ఉంటే.. 9490617444 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు.