Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్ చేయకుండా వ్యక్తిని టార్గెట్ చేసి విచారణ జరుగుతోందని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా. అదే వాస్తవం. విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రోయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.