Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
హైదరాబాద్‌లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ శుక్రవారం టీఎస్ పీజీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2023-24 విద్యా సంవత్సరానికి ఎంఈ, ఎంటెక్, ఎంఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
ఈ తరుణంలో టీఎస్ పీజీఈసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 28న విడుదల కానుంది. మార్చి 3వ తేదీ నుంచి ఆన్లైన్లో అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఏప్రిల్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 2 నుంచి 4వ తేదీ మధ్యలో దరఖాస్తులను ఎడిట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రూ. 250 ఆలస్య రుసుంతో మే 5 వరకు, రూ. 1000 తో మే 10, రూ. 2,500తో మే 15, రూ. 5 వేల ఆలస్య రుసుంతో మే 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మే 21 నుంచి టీఎస్ పీజీఈసెట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.