Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఆర్థిక మాంద్యం భయాందోళనల నడుమ ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ ఇటీవల తమ సంస్థలో భారీగా ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కార్యాలయాల నిర్వహణకు వెచ్చిస్తున్న వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న గూగుల్ కార్యాలయాల్లో అనవసరమని భావిస్తున్న కొన్నింటిని ఖాళీ చేస్తున్నట్లు గూగుల్ వర్గాలు తెలిపాయి. అందులోని ఉద్యోగుల్ని మరోచోట సర్దుబాటు చేస్తోంది. ఈ మేరకు ఉద్యోగులు తమ డెస్క్‌లను షేర్ చేసుకోవాలని ఆదేశించింది. గూగుల్ తాజా నిర్ణయంతో ఒకే డెస్క్‌ను ఇద్దరు ఉద్యోగులు వాడుకోవాల్సి ఉంటుంది. ముందుగా ఈ డెస్క్ షేరింగ్ విధానం కిర్క్లాండ్, వాషింగ్టన్, న్యూయార్క్, శాన్ఫ్రాన్సిస్కో, సియాటెల్, సన్నీవేల్, కాలిఫోర్నియాలో ఉన్న కార్యాలయాల్లో అమలు చేయనున్నారు. ఈ మేరకు డెస్క్ షేర్ చేసుకోవాలంటూ ఆయా నగరాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కంపెనీ అంతర్గత మెమో జారీ చేసినట్లు సీఎన్‌బీసీ ఓ నివేదిక వెల్లడించింది. ఇందుకోసం ఆయా ఉద్యోగులను పరస్పర అంగీకారంతో రోజు విడిచి రోజు ఆఫీసుకు రమ్మని పిలుస్తున్నట్లు పేర్కొంది.