Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైపూర్: పొలం వివాదంపై ఘర్షణ నేపథ్యంలో ఒక వ్యక్తి తుపాకీ ఎక్కుపెట్టాడు. మేనల్లుడి ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. రాజస్థాన్లోని అజ్మీర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బీవర్ ప్రాంతానికి చెందిన బగ్గా అనే వ్యక్తి తన మేనల్లుడు హమీద్ పొలంలో మట్టి తవ్వుతున్నాడు. అయితే అతడి మేనల్లుడు దీనిని గమనించి అభ్యంతరం వ్యక్తం చేశాడు. తన పొలంలోని మట్టిని తవ్వ వద్దని బగ్గాకు చెప్పాడు. దీంతో వారిద్దరి మధ్య ఈ అంశంపై ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన బగ్గా తన వద్ద ఉన్న తుపాకీని ఎక్కుపెట్టాడు. ఎదురుగా ఉన్న మేనల్లుడు హమీద్ ప్రైవేట్ భాగంలో కాల్పులు జరిపాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. మరోవైపు బగ్గా తనపై కాల్పులు జరిపిన సంఘటనను మేనల్లుడు హమీద్ తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. హమీద్ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.