Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ముంబై
స్వీడన్‌కు చెందిన టెలికాం దిగ్గజం ఎరిక్సన్ భారీగా ఉద్యోగులను తొలగించింది. టెలికాం పరికరాల తయారీ సంస్థ ఎరిక్సన్ ఖర్చులను తగ్గించుకునే ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8,500 మంది ఉద్యోగులను తొలగిస్తుందని రాయిటర్స్ శుక్రవారం నివేదించింది. లోకల్ బిజినెస్‌ను బట్టి ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని ప్రకటించిన ఎరిక్సన్ సీఈవో బోర్జే ఎఖోల్మ్ ఇప్పటికే ఆయా ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించినట్టు తెలుస్తోంది.