Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అగ్రరాజ్యం అమెరికా ప్రపంచంలో ఎంతోమంది విద్యార్థులకు గమ్యస్థానం. ఇప్పుడు విద్యార్థులకు లాభించేలా అమెరికా ప్రభుత్వం కొత్త వీసా విధానం తీసుకువచ్చింది. అమెరికాలో కోర్సు ప్రారంభానికి ఏడాది ముందే స్టూడెంట్ వీసాకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించింది. గతంలో కోర్సు ప్రారంభానికి 120 రోజుల ముందు మాత్రమే వీసాకు దరఖాస్తు చేసుకునే వీలుండేది. ఈ పరిమితిని తాజాగా ఏడాదికి పెంచారు. వేసవిలో అధికంగా విద్యార్థి వీసా స్లాట్లు కేటాయిస్తామని భారత్ లోని అమెరికా దౌత్య కార్యాలయం వెల్లడించింది. అమెరికాలో నూతన వీసా విధానం గత 26 నుంచి అమల్లోకి వచ్చింది.