Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భీంపూర్ : ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్‌కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్‌కు పులులు తారసపడ్డాయి. గుంజాల - గొల్లఘాట్ మార్గంలో వస్తుండగా ఒక పెద్దపులి, మూడు పిల్లలు రోడ్డు దాటుతూ కనిపించాయి. వాటిని చూసి వాహనం ఆపిన డ్రైవర్, వీడియో తీసి అధికారులకు సమాచారం అందించాడు. కాగా, శుక్రవారం ఎఫ్ఆర్వో గులాబ్‌సింగ్, ఎఫ్ఎస్వో అహ్మద్ ఖాన్, ఎఫ్‌బీవోలు గులాబ్, సజన్ లాల్, బేస్ క్యాంపు సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గొల్లఘాట్, గుంజాల, పిప్పల్‌కోటి శివార్లలో 10 సీసీ నైట్ విజన్ కెమెరాలు అమర్చామని తెలిపారు. ఒక తల్లి పులి, మూడు పిల్లలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్ఆర్వో గులాబ్ సింగ్ తెలిపారు.