Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు జరగనున్నాయి. రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో శ్రీవారు, అమ్మవార్లు తెప్పలపై భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల కారణంగా మార్చి3,4 తేదీల్లో తోమాలసేవ, అర్చన, సహస్రదీపాలంకార సేవ, 5,6 తేదీల్లో తోమాలసేవ, అర్చన, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, 7న ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలను టీటీడీ రద్దు చేసింది.