Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్ : వరంగల్ కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు ఈ రోజు సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని... వెంటీలేటర్, ఎక్మోపై చికిత్స కొనసాగిస్తున్నట్లు వైద్యుల బృందం ప్రకటించింది. ప్రీతిని రక్షించేందుకు నిమ్స్ వైద్యులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తోంది.
ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకున్నారు. దీని ప్రభావం శరీరంలోని భాగాలపై విపరీతంగా ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్‌పై మత్తు ఇంజెక్షెన్ ప్రభావం ఎక్కువగా పడుతుంది. ఈ నేపథ్యంలో ప్రీతికి మెరుగైన వైద్యం కోసం వరంగల్ నుంచి హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో దాదాపు మూడు సార్లు ప్రీతి గుండె ఆగిపోయింది. వెంటనే సీపీఆర్ చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా వైద్యులు చేశారు. నిమ్స్‌కు చేరుకున్న అనంతరం ప్రీతికి పూర్తిగా వెంటీలేటర్, ఎక్మోపైనే చికిత్స కొనసాగుతోంది.