Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లి
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే పలువురిని సీబీఐ అరెస్ట్ చేసింది. తాజాగా దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు CBI సమాన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని ఈ సమన్లలో సీబీఐ తెలిపింది.
అయితే గతేడాది అక్టోబర్ లో కూడా మనీష్ సిసోడియాను 9 గంటల పాటు సీబీఐ విచారించింది. అంతేకాదు ఆయన నివాసంలో, కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అప్పుడు మనీష్ సిసోడియా సీబీఐ విచారణ, లిక్కర్ స్కాంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్సైజ్ పాలసీ కేసును పూర్తిగా నకిలీ, కల్పితంగా ఆయన అభివర్ణించారు. ఇది ఎక్సైజ్ పాలసీ లేదా అవినీతికి సంబంధించిన కేసు కాదని ప్రశ్నించినప్పుడు తనకు అసలు విషయం అర్థమైందని అన్నారు. ఫిబ్రవరి 18న ఆయనకు మొదటిసారి సీబీఐ సమన్లు ఇచ్చింది. 19న విచారణకు రావాలని ఆ నోటీసుల్లో తెలిపింది. అయితే బడ్జెట్ రూపకల్పనలో ఉన్నందున తాను సీబీఐ విచారణకు రాలేనని మనీష్ సిసోడియా సీబీఐకి లేఖ రాశారు. ఆయన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న సీబీఐ 26న విచారణకు రావాలని మళ్లీ నోటీసులు ఇచ్చారు.