Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢీల్లీ
నీట్-పీజీ రాసేందుకు 2.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని మార్చి 5న జరగాల్సిన ఈ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా వేయలేమని నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్(ఎన్బీఈ) సుప్రీంకోర్టుకు తెలిపింది.
పరీక్ష వాయిదావేస్తే సమీప భవిష్యత్తులో ప్రత్యామ్నాయ తేదీ కూడా అందుబాటులో లేదు అని తెలిపింది. ఈ పరీక్షను 3 నెలలు పాటు వాయిదా వేయాలంటూ దాఖలైన పలు పిటిషన్లపై జస్టిస్ ఎస్.ఆర్.భట్, జస్టిస్ దీపంకర్ దత్తా ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ తరుణంలో వాయిదా వేయకపోతే ఎంత మందిపై ప్రభావం పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి పిటిషనర్ల తరఫు న్యాయవాది సమాధానమిస్తూ 45 వేల మంది అని తెలిపారు. ఈ సమస్యకు ఎన్బీఈ ఒక పరిష్కారంతో రావాలని కోరుతూ ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.