Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - భోపాల్
కేరళలోని కొచ్చిన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం భోపాల్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగింది. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కి చెందిన 6ఈ2407 విమానం కొచ్చిన్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నది. అయితే విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడి ఆరోగ్యం విషమించడంతో విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో అత్యవసర పరిస్థితిలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించారు.
ఈ తరుణంలో అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న సిబ్బంది ప్రయాణికుడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే దీనివల్ల ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడికల్ ఎమర్జెన్సీ క్రమంలో విమానాన్ని భోపాల్‌కు దారిమళ్లించినట్లు తెలిపింది.