Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మధ్యప్రదేశ్
సత్నా సరిహద్దులో ఘోర రోడ్డుప్రమాదం సంభవిచింది. ఆగివున్న రెండు బస్సులను ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందగా 50 మందికి గాయాలయ్యాయి. ప్రమాదం ధాటికి ఒక బస్సు రెండు భాగాలుగా విడిపోగా, మరొకటి నుజ్జునుజ్జు అయింది. ఈ ప్రమాదం ఎంపీలోని బర్కడ గ్రామంలోని మోహానియా టన్నెల్ వద్ద చోటు చేసుకుంది బస్సులో ప్రయాణిస్తున్న వారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీకి వెళ్లి తిరిగివస్తున్నట్లు సమాచారం.
అయితే ఈ ప్రమాదానికి ట్రక్కు టైర్ పగలడం కారణమని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 10 నుంచి 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.