Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త చోటుచేసుకుంది. వర్సిటీలో విద్యార్థి సంఘాల నాయకులు పరస్పరం దాడులు చేసుకున్నారు. వర్సిటీలో స్టూడెంట్ యూనియన్ ఎన్నికలు నిన్న జరిగాయి. నేడు సంబంధిత ఫలితాలు వెలువడనున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏబీవీపీ, ఎస్.ఎఫ్.ఐ లకు చెందిన విద్యార్థులు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ క్రమంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.