Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
భారత్ బయోటెక్ గ్రూపు సంస్థ జంతు టీకాలు, మందుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బయోవెట్ రేబిస్ వ్యాధి వ్యాప్తిని నిరోధించేందుకు కుక్కలకు ఇచ్చే టీకాను అభివృద్ధి చేయడంపై పరిశోధనలు చేపట్టిందని భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (బీబీఐఎల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.సాయిప్రసాద్ తెలిపారు.
ఈ తరుణంలో శుక్రవారం ప్రారంభమైన బయో ఆసియా 2023 చర్చాగోష్ఠిలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. కుక్కకాటుతో రేబిస్ సోకి మన దేశంలో ఏటా 25,000 మందికి పైగా చనిపోతున్నందున, సాధ్యమైనంత త్వరగా ఈ టీకాను ఆవిష్కరిస్తామని సాయిప్రసాద్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో ఈ టీకాను ఆవిష్కరించాలనేది ఆలోచనని తెలిపింది.