Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో రైతులకు కమిషనర్ దారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో వివాదం జరిగింది. మిర్చిని అమ్ముకోవటానికి వచ్చిన రైతులను కమిషన్ దారులు అడ్డుకున్నారు. దీంతో మిర్చి అమ్మడంపై ఎందుకు అడ్డుకుంటున్నారు అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా పొట్టన కొట్టకండి అంటూ రైతులు వాపోయారు. అయితే కమిషన్ దారులు సశేమిరా అన్నారు. మిర్చి అమ్మడం ఆపివేయాల కోరారు. దీంతో అడ్డుకున్న కమిషన్ దారులపై రైతు కుటుంబం దాడికి పాల్పడ్డారు. ఈ తరుణంలో రైతులు ఆగ్రహం కట్టెలు తెంచుకుంది మేము న్యాయంగా చేస్తుంటే కమిషన్ దారులు ఇలా అడ్డుకోవడం తగదంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో రైతులకు గాయాలయ్యాయి. ఈఘటనపై స్థానిక సమచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు రైతులను అదుపులో తీసుకున్నారు.