Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
విచారణకు రావాలని సీబీఐ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని వైఎస్ భాస్కర్ రెడ్డి తెలిపారు. గతంలో నోటీసు ఇచ్చిన సందర్భంలో ఈ నెల 24 తరువాత అందుబాటులో ఉంటానని సమాచారం ఇచ్చానని, కానీ ఇవాళ సీబీఐ విచారణకు హాజరవుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఈ తరుణంలో విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధమని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.