Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - చెన్నై
మాజీ ముఖ్యమంత్రి ఒ.పన్నీర్ సెల్వం తల్లి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తల్లి పళనియమ్మాళ్ నాచియార్ (95) తేనిలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో శుక్రవారం రాత్రి మృతి చెందారు.
తేనిజిల్లా పెరియకుళంలోని తన స్వ గృహంలో నివశిస్తున్న పళనియమ్మాళ్ గత కొంతకాలంగా వృద్ధాప్యంతో కూడిన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. రెండు రోజుల క్రితం ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబీకులు తేనిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. పళనియమ్మాళ్ మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు తీవ్ర సంతాపం ప్రకటించారు.